టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నాం: ప్రతీక్ జైన్
VKB: మద్యం షాపుల టెండర్లకు పారదర్శకంగా డ్రా తీయడం జరుగుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ అంబేద్కర్ భవన్‌లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్ల డ్రా ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించారు. ఎలాంటి అవకతవలకు తావివ్వకుండా టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు.