వేములవాడలో ఘనంగా దీక్ష దివస్

వేములవాడలో ఘనంగా దీక్ష దివస్

SRCL: వేములవాడలో తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసిన దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను స్మరించుకుంటూ తెలంగాణ తల్లి, అమరవీరులకు నివాళులర్పించారు. పూలమాలలు సమర్పించి, పాలాభిషేకం చేసి ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. రామతీర్థపు మాధవి రాజు, ఏనుగు మనోహర్ రెడ్డి, రవి, కందుల కాంతి కుమార్ పాల్గొన్నారు.