రూ.12 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
RR: ప్రతి పల్లెలోను రవాణా సదుపాయాలను మెరుగుపరచి ఆ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎన్ హెచ్ 44 నుంచి భీమారం గ్రామం వరకు రూ.12 కోట్లతో నిర్మాణం జరుపుతున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ బీటి రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుందన్నారు.