ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించలేదు: సీఐ ప్రకాష్
ఎన్టీఆర్: బహిరంగంగా మద్యం తాగడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే సహించేదిలేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మాచవరం సీఐ ప్రకాశ్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన వైఎస్ఆర్ కాలనీలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురి రౌడీ షీటర్ల ఇంటికీ వెళ్లి తనఖీలు చేశారు.