'బెస్' ప్రారంభానికి సింగరేణి ఏర్పాట్లు
AP: రాష్ట్రంలో మొట్టమొదటి బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ (బెస్) నిర్మాణం పూర్తయ్యింది. దీంతో మూడురోజుల్లో ప్రారంభానికి సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి వద్ద గల సింగరేణి సోలార్ ప్లాంట్‌లో మెగావాట్ విద్యుత్ నిల్వ సామర్థ్యంతో బెస్‌ను ఏర్పాటు చేసింది. దీనివల్ల ఏటా సుమారు రూ.70లక్షల కరెంట్ ఆదా అవుతుందని సంస్థ అంచనా వేసింది.