VIDEO: 'కాలువ దురాక్రమణపై అధికారులు చర్యలు తీసుకోవాలి'

CTR: పుంగనూరు మండలం పరిధిలోని హంద్రీనీవా కాలువ దురాక్రమణకు గురవుతుందని బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్, నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 316 పైకి ఐదు ఎకరాల భూమిలో దాదాపు 1.70 సెట్ల భూమి దురాక్రమనకు గురైనట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. ఈ ఘటనపై వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించాలని అయుబ్ ఖాన్, నరసింహులు డిమాండ్ చేశారు.