70 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ATP: ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ. 44,74,717 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు. అనంతపురంలోని తన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.