అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
HNK: ప్రజా సమస్యలను చూసి తప్పించుకునే పరిస్థితి లేదని, సమస్య ఉన్న ప్రతి ప్రాంతాన్ని స్వయంగా పర్యటించి పరిష్కారం చూపడం తమ బాధ్యత అని MLA నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొనిరావాలని సూచించారు.