VIDEO: ఫీజు కోసం చిన్నారిపై చర్యలు.. తల్లిదండ్రుల నిరసన

VIDEO: ఫీజు కోసం చిన్నారిపై చర్యలు.. తల్లిదండ్రుల నిరసన

BHPL: జిల్లా కేంద్రంలోని సెయింట్ పీటర్స్ స్కూల్ వద్ద ఫీజు వివాదంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫీజు చెల్లించలేదని యూకేజీ విద్యార్థిని సమన్వితను గురువారం స్కూల్‌లోకి రాకుండా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటనకు నిరసనగా తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలో పుస్తకాలు చదువుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. స్కూల్ యజమానిపై చర్య తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.