పుంగనూరు పురపాలకపాలక వర్గానికి రేపే చివరి రోజు
CTR: పుంగనూరు పురపాలక పాలకవర్గం పదవీకాలం రేపటితో ముగియనుంది. వారి స్థానంలో ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. పురపాలికలో మొత్తం 31 వార్డుల్లో వైసీపీనే అధికారం చేపట్టింది. మున్సిపల్ ఛైర్మన్‌గా అలీమ్ బాషా బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ఎన్నికలు జరిగేంత వరకు కౌన్సిల్, ఛైర్మన్ నిర్వహించే బాధ్యతలను ప్రత్యేక అధికారి నిర్వహించనున్నారు.