VIDEO: శివాలయంలో అద్భుత ఘటన
SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో కార్తీకమాసం 10వ రోజు శుక్రవారం అద్భుతం చోటుచేసుకుంది. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి శిరస్సుపై ఉంచిన పుష్పాలు ప్రధాన అర్చకుడు విష్ణువర్ధన్ శర్మ చేతిలో ఎవరి ప్రమేయం లేకుండా పడ్డాయి. ఇది స్వామివారి అనుగ్రహానికి సూచిక అని అర్చకులు వివరించారు.