రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
MDK: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట (మం) కొరివిపల్లిలో చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన లాలు మండల్(42) వడ్ల కొనుగోలు కేంద్రంలో హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కిరాణం షాప్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గత వారం కిందటే పనికోసం నేపాల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.