'పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత'

CTR: పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 'స్వచ్చాంద్ర స్వచ్చ దివస్' కార్యక్రమం శనివారం జరిగింది. మెడికల్ సూపరిడేంట్ డాక్టర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలు దరి చేరవని సూచించారు.