ఆసిఫాబాద్‌లో పోలీసుల ముమ్మర తనిఖీలు
ASF: ఆసిఫాబాద్ పట్టణంలో రాత్రి వేళ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని ఎస్ఐ కొమురయ్య సూచించారు. రాంగ్ రూట్ ప్రయాణం ప్రమాదకరమని, మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌తో అన్ని పేపర్లు తమ వెంట ఉంచుకోవాలని వివరించారు.