సాగునీరు లేక ఎండుతున్న వరి పైర్లు

SRPT: గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో పెన్‌పహాడ్ మండల రైతులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. కాళేశ్వరం నీళ్లు వస్తాయనే ఆశతో SRSP కాల్వల కింద వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలను విడుదల చేయకపోవడం ఒకవైపు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బోర్లు ఎండిపోవడంతో సాగు నీరందక వరి పైర్లు ఎండిపోతున్నాయి.