మహిళా ఉద్యమానికి పునాది వేసిన ధీర వనిత

మహిళా ఉద్యమానికి పునాది వేసిన ధీర వనిత

1910లో భారత స్త్రీ మహామండల్ పేరుతో దేశపు తొలి మహిళా సంస్థను సరళా దేవి చౌధురాణి స్థాపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలైన ఆమె.. లాహోర్ నుంచి కోల్‌కతా వరకు కులమతాలకు అతీతంగా మహిళలను ఏకం చేశారు. భారత్ స్త్రీ శిక్షా సదన్ ద్వారా స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ, వేలాది మంది మహిళల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపిన ఒక అద్భుతమైన విద్యాదాత ఆమె.