'మార్కులు రావట్లేదు.. చనిపోతున్నా'
AP: కాకినాడ జిల్లా తుని మండలంలో విషాదం చోటుచేసుకుంది. లోవకొత్తూరుకు చెందిన పదో తరగతి విద్యార్థి కొండ్ర కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలు సమీపిస్తుండటంతో చదవలేకపోతున్నాననే మనోవేదనతో హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. సరిగా చదవలేకపోతున్నానని, మార్కులు రావట్లేదని తరచూ చెప్పేవాడని తండ్రి శ్రీను తెలిపాడు.