'నేడు వేదికపైకి అరంగేట్రం చేయనున్న చిన్నారులు'

KMM: మధిర పట్టణంలో నూతనంగా ప్రారంభించబడిన కళాసాధన నృత్య కళానికేతన్ నందు గత 90 రోజులుగా కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు గురువారం మొట్ట మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణ వేదికపై అరంగేట్రం చేయనున్నట్లు జిల్లా రంగస్థలం కళాకారుల సమైక్య అధ్యక్షులు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.