హామీలు అమలు చేయాలి: మేడి విజయ్ కుమార్
NLG: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. ఈ దీపావళి పండుగ సందర్భంగానైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.