VIDEO: భక్తి శ్రద్దలతో సంకష్టహర చతుర్థి పూజలు
AKP: నర్సీపట్నం బాల వినాయక స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం సంకష్టహర చతుర్థి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేశ్వరరావు వినాయక స్వామికి ప్రత్యేక అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకృతిలో దీపాలు అలంకరించి మహిళలు దీపాలు అలంకరణ గావించారు. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన దీపాలతో ప్రాంగణం మొత్తం దేదీప్యమానంగా మారింది.