VIDEO: అట్టహాసంగా ప్రారంభమైన కుస్తీ పోటీలు
KMR: బాన్సువాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఇవాళ కుస్తీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి మల్లయోధులు పాల్గొనగా, మహిళా మల్లయోధుల పోరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎండ తీవ్రత దృష్ట్యా నిర్వాహకులు టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు.