VIDEO: రైస్ మిల్లులపై సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు
NZB: బోధన్ శివారులోని పలు రైస్ మిల్లులపై సివిల్ సప్లై విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గతంలో బ్లాక్ లిస్ట్‌లో ఉన్న మిల్లులతో సహా, నిల్వ చేసిన స్టాక్ వివరాలను పరిశీలించారు. ఎడపల్లి, కోటగిరి, సాలూరా, పల్లీ మండలాల్లో తనిఖీలు కొనసాగించారు. అధికారులు సీఎన్ఆర్ నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను సరిపోల్చి చూస్తున్నారు.