పెండింగ్ బిల్లులు అడిగినందుకు దాడి

పెండింగ్ బిల్లులు అడిగినందుకు దాడి

TG: భూపాలపల్లి కలెక్టరేట్‌లో APAO అత్యుత్సాహం ప్రదర్శించాడు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన కాంట్రాక్టర్‌పై బూతు పురాణం చదివాడు. అంతటితో ఆగకుండా టేబుల్‌పై ఉన్న వస్తువులతో కాంట్రాక్టర్‌పై దాడికి దిగాడు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఈ అంశంపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశానని, కానీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.