డిప్యూటీ సీఎంకు రాఖీ కట్టిన సీతక్క

HYD: రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం మంత్రి సీతక్క డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్కకి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రుల నివాస సముదాయంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ శుభవేళ ఇరువురూ స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సీతక్కతో మహిళ నాయకులు ఉన్నారు.