సొసైటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
NTR: ఏపీలో అభివృద్ధి, సంక్షేమంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు దూసుకుపోతున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలోని శ్రీరాంపురంలో రూ.32 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి, రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సొసైటీ భవన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.