అధికారులకు పరిష్కార చర్యలు చేపట్టాలి: కలెక్టర్
కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక "మీకోసం" కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన ప్రజా సమస్యల అర్జీలను కలెక్టర్ స్వయంగా స్వీకరించి, పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.