గోదావరిఖనిలో రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు

గోదావరిఖనిలో రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు

పెద్దపల్లి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో బంద్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ మేరకు శనివారం గోదావరిఖనిలో బందు కొనసాగుతుంది. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అటు జిల్లా వ్యాప్తంగా అన్ని దుకణాలను సైతం మూసివేసినట్లు జిల్లా బీసీ నేతలు పేర్కొన్నారు.