నేడు పలమనేరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నేడు పలమనేరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

CTR: ప్రభుత్వం నూతనంగా స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించింది. వీటిని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇవాళ పంపిణీ చేయనున్నారు. పట్టణం భజంత్రీ వీధిలోని రేషన్ షాపు వద్ద ఈ రోజు ఉదయం 9 గంటలకు కార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. కాగా, కార్డుల పంపిణీ అనంతరం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ఎమ్మెల్యే ప్రసంగించనున్నారు.