రేపు జిల్లాకు రానున్న ఎస్సీ కమిషన్ సభ్యులు
PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారామ్ బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మార్చి 25న ఉదయం 10.30 గం.లకు పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం 11.30 గం.ల నుంచి మధ్యాహ్నం 1.00 గం.ల వరకు చింతలబెలగాం, తుమ్మలవలస గ్రామాల్లోని భూసర్వే నెంబర్లను పరిశీలిస్తారని పేర్కొన్నారు.