కుంగిన రోడ్డుతో పొంచి ఉన్న ప్రమాదాలు
NLG: చిట్యాల వనిపాకల రోడ్డులో ఉన్న మూలమలుపుల వల్ల తరచు ప్రమాదాలు జరుగుచుండగా.... దీనికి తోడు ఓ మూలమలుపులో రోడ్డు కుంగడంతో ద్విచక్ర వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరమే రోడ్డు వేసినప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డు కుంగిందని వాహనదారులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేశారు.