'అంగన్వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించాలి'

SKLM: అంగన్వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించాలని సోంపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో వసుంధర దేవి సూచించారు. మంగళవారం ఆమె సోంపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో కంచిలి, సోంపేట మండలాల అంగన్వాడీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన ప్రతీ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాలన్నారు.