ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం

ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం

WGL: ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం ఎల్.బి కళాశాలలో ప్రిసైడింగ్ (పి.ఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ (ఏ.పి.ఓ)లకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ శిబిరాన్ని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి డీఈఓ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణతీరును పరిశీలించారు.