బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

VZM: గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. శుక్రవారం వేపాడ మండలం ముకుందపురం గ్రామానికి చెందిన బర్లవారి కళ్లాలు నుంచి ఎస్.కోట మండలం వశి గ్రామానికి చెందిన తాటితోట కళాలు లింక్ రోడ్డుకి సంబందించిన రూ.40లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.