ఎమ్మెల్యేకు గ్రామస్థుల వినతి

PPM: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని ఆమె క్యాంపు కార్యాలయంలో జియ్యమ్మవలస మండలం హరిపురం గ్రామస్థులు కలసి గ్రామంలో బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందజేశారు. గిజబ నుంచి హరిపురం గ్రామం వరకు, అలాగే చింతలబెలగాం BT రోడ్డు నుంచి హరిపురం వరకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే రొడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.