కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం చర్చ
KRNL: కర్నూలులోని ఏ, బీ, సీ క్వార్టర్స్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. బుధవారం ఎస్బీఐ కాలనీలో కేఎంసీ అధికారులతో సమావేశంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. కర్నూలులోనే హైకోర్టు బెంచ్ ఉండటం మంచిదని సీఎం కూడా అభిప్రాయపడ్డారని తెలిపారు.