VIDEO: 'తుఫానుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి'

VIDEO: 'తుఫానుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి'

ELR: మొంథా తుఫాను వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపోయిన ఉద్యాన పంటల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం, ఎం.నాగులపల్లి గ్రామాలలో ఉద్యాన పంటలకు జరిగిన నష్టాలను పరిశీలించారు. అనంతరం రైతులను అడిగి నష్టం వివరాలను సేకరించారు.