చిత్తడి నేలల వివరాలను సేకరించండి: కలెక్టర్
ములుగు జిల్లాలోని చిత్తడి నేలల వివరాలు సేకరించాలని,తక్షణమే సర్వే జరపాలని కలెక్టర్ దివాకర అధికారులకు ఆదేశించారు.డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ ఆధ్వర్యంలో చిత్తడి నేలల కమిటీతో సమీక్ష జరిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి చిత్తడి నేలల డేటాను సమర్పించాలని సూచించారు.సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్,డీఆర్డీఓ శ్రీనివాసరావు,అధికారులు పాల్గొన్నారు.