ప్రభుత్వ కార్యాలయంలో భారీ మోసం

ప్రభుత్వ కార్యాలయంలో భారీ మోసం

AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో జరిగిన భారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో నుంచి రూ.1.50 కోట్ల నిధులు గోల్‌మాల్ అయ్యాయి. ఉన్నతాధికారులు రికార్డులు చెక్ చేస్తుండగా ఈ విషయం బయటపడినట్లు సమాచారం. దీంతో ముగ్గురు అధికారులపై విచారణకు ఆదేశించారు.