దాహార్తి తీర్చేందుకు ముందుకొచ్చిన యువత
తూ.గో: సీతానగరం మండలం నాలుగు బొమ్మ సెంటర్‌లో యూత్ ఆధ్వర్యంలో వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా CPI(ML) రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు హాజరై ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక యువత భారీగా పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.