ఎండిన చెట్టు తొలగించకుంటే ప్రమాదమే..!
NZB: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్‌లో గణపతి ఆలయం ప్రధాన రహదారి పక్కన ఎండిపోయిన చెట్టు ఇది. నిత్యం ఈ దారిలో భక్తులు, చిన్న పిల్లలు వెళ్తుంటారు, చెట్టు కొమ్మలు ఎప్పుడు విరిగి పడతాయో తెలియడం లేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయిన చెట్టును వెంటనే తొలగించేలా మున్సిపల్ అధికారులుచొరవ తీసుకోవాలని కోరుతున్నారు.