నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
E.G: లాలాచెరువు హోసింగ్ బోర్డు సబ్ స్టేషన్ పరిధిలో ట్రీ కటింగ్ నిమిత్తం శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఈ కారణంగా 500 బస్సు స్టాప్, స్కేటింగ్ పార్క్ ఏరియా, పెద్ద మసీదు, చిన్న మసీదు సెంటర్, గాంధీపార్క్, శ్రీలంక కాలనీ, రాజేష్ కాలనీ ఏరియాలలో సరఫరా ఉండదన్నారు.