సత్తా చాటిన '#90s వెబ్ సిరీస్

ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ '#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'. 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్‌లో ఈ సిరీస్ సత్తా చాటింది. మూడు అవార్డులను దక్కించుకుంది. OTT విభాగంలో ఉత్తమ సిరీస్‌గా, దర్శకుడిగా ఆదిత్య హాసన్, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్‌కు అవార్డులు వచ్చాయి. ఇందులో 90sలో మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.