మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ని కోరారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం మంత్రిని నసీర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పొత్తూరివారితోట, మణిపురం, రాజీవ్ గృహకల్ప, శారదాకాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందని వివరించారు.