'ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి'

ADB: ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ అన్నారు. బుధవారం అదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అధ్యక్షతన ఎయిడ్స్ వ్యాధిపై కళజాత కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్ వల్ల కలిగే లక్షణాలను దాని నివారణ మార్గాలను విద్యార్థులకు తెలిపారు.