కొరిశపాడులో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

BPT: కొరిశపాడు గ్రామంలో మంగళవారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. తొలుత ఆయన ఎస్సీ కాలనీ నందు జరిగిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ప్రజల నుంచి సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించి, వాటిని వెంటనే పరిష్కరించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.