జైపూర్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం
ASR: డుంబ్రిగుడ మండలంలోని జైపూర్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. డుంబ్రిగుడ(M) బోడపుట్ గ్రామానికి చెందిన కిల్లో సునీల్ అనే యువకుడు అరకు వైపు నుంచి డుంబ్రిగూడ వైపు బొల్లేరో వాహనంలో వస్తున్న సమయంలో అద్భుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన అతడిని అంబులెన్స్‌లో అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.