దర్శకుడికి మంత్రి ఆనం అభినందనలు

NLR: మర్రిపాడు మండలం చుంచులూరు రాజుపాలెం గ్రామానికి చెందిన రాకేశ్ వర్మ బ్లైండ్ స్పాట్ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈక్రమంలో ఆయన దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మంగళవారం కలిశారు. నూతన దర్శకుడికి మంత్రి అభినందనలు తెలిపారు. సినిమా విజయవంతం కావాలని, రాకేష్ వర్మ గొప్ప దర్శకుడిగా రాణించాలని మంత్రి ఆకాంక్షించారు.