టీడీఆర్‌ల జారీ వేగవంతం
KRNL: నగరంలోని కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట బ్రిడ్జి వరకు చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు సంబంధించి DTR బాండ్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉస్మానియా కళాశాల, వడ్డేగేరి ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు సంబంధించిన కొలతలను కమిషనర్ పరిశీలించారు. నగరాభివృద్ధిలో చేపడుతున్న పనులు వేగవంతం చేస్తామన్నారు.