'లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

BDK: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మణుగూరులో వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ నరేష్ సోమవారం తెలిపారు. గోదావరి ప్రాంతంలో, పొంగి ప్రవహిస్తున్న చెరువులు, నీటి కుంటల వద్ద, వాగుల్లో చేపలు పట్టేందుకు ఎవరు వెళ్లొద్దని మత్స్యకారులకు, యువకులకు సూచనలు జరి చేశారు.