నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కృష్ణా: పెనమలూరు మండలంలో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా ఉండదని విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు యనమలకుదురు పరిధిలోని లంబాడిపేట, మార్కండేయనగర్, హరిజనవాడ, భగత్సాంగ్ నగర్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదని అధికారులు పేర్కొన్నారు. మరమ్మతుల పనుల కారణంగా తాత్కాలికంగా విద్యుత్ నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు.